నా బాడీని సింహాలకు ఆహారంగా వేయాలన్న నటుడు

ప్రముఖ బ్రిటన్ హాస్యనటుడు, నిర్మాత, డైరెక్టర్ రికీ జెర్వీన్ వింత కోరిక కోరాడు. తాజాగా ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కోరిన కోరిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘మీరు చనిపోయిన తర్వాత మీ బాడీని ఏం చేయాలనుకుంటున్నారు’ అని ఛానెల్ ప్రతినిధి ప్రశ్నించాడు. దీనికి రికీ జెర్వీన్ సమాధానం ఇస్తూ.. చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని లండన్ జూపార్కులోని సింహాలకు ఆహారంగా వేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

ricky gervais body TIGER

తన మృతదేహాం ఇలాగైనా ఉపయోగపడుతున్నందుకు సంతోషపడతానని, తన మృతదేహాన్ని సింహాలు పీక్కు తింటుంటే అప్పుడు సందర్శకుల ముఖాల్లోని భావాలని చూడాలని ఉందన్నాడు. ఈ క్రమంలో రికీ జెర్వీన్ వ్యాఖ్యలపై లండన్ జూపార్క్ స్పందించింది. రికీని తినడానికి తమ జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చని సరదాగా వ్యాఖ్యానించింది. ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే విరాళాల రూపంలో ఇవ్వాలని, ఆ సొమ్ముతో ఆహారం కొనుగోలు చేసి సింహాలకు వేస్తామంది.