ఈ గ్యాప్ లో ఇంకెన్ని పేర్లు బయటకి వస్తాయో

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు, సుశాంత్ సింగ్ రాజపుత్ డెత్ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అది ఇప్పుడు బాలీవుడ్ నే షేక్ చేసే డ్రగ్స్ రాకెట్ వరకూ వెళ్ళింది. ఈ డ్రగ్స్ రాకెట్ లో ఏ స్టార్ హీరో, ఏ స్టార్ హీరోయిన్ పేరు ఎప్పుడు వినాల్సి వస్తుందో అని బాలీవుడ్ వర్గాలంతా భయపడుతున్నారు. ఇప్పటికైతే 25మంది లిస్ట్ రెడీ అయ్యింది అన్నారు కానీ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఈ మొత్తం విషయంలో మెయిన్ ఏక్యూస్డ్ అయిన రియా చక్రవర్తికి మాత్రం చుక్కలు కనపడుతూ ఉంటాయి. డ్రగ్స్ సప్లై చేసిన విషయంలో నార్కోటిక్స్ బ్యూరో రియాని సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు.

14 రోజుల పాటు రిమాండ్ ఉన్న రియా, గడువు ముగియడంతో బెయిల్ పిటీషన్ వేసింది. విచారణ స్పీడ్ గా జరుగుతుంది కాబట్టి రియాకి బెయిల్ ఇవ్వలేమన్న కోర్ట్, మరోసారి ఆమెకి రిమాండ్ పెంచుతూ తీర్పునిచ్చింది. తాజా తీర్పుననుసరించి రియా అక్టోబర్ 16 వరకూ రియా రిమాండ్ లోనే ఉండనుంది. ఇప్పటికే కొంతమంది పేర్లని రియా బయటపెట్టింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఇద్దరు స్టార్ హీరోలు, బడా ప్రొడ్యూసర్, ఒక సీనియర్ హీరో కూతురు కూడా ఉందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇంకా ఈ లిస్ట్ లో ఎంత మంది చేరుతారు? రియాకి అక్టోబర్ 16 అయినా బెయిల్ వస్తుందా లేక మళ్లీ రిమాండ్ పెంచుతారా అనేది చూడాలి.