ఆత్మహత్య చేసుకోకపోతే చంపేస్తారా: సుశాంత్ గర్ల్ ఫ్రెండ్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తరువాత అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అనేక రకాల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి సోషల్ మీడియాలో కామెంట్స్ డోస్ పెరగడంతో ఆమె స్పందించక తప్పలేదు. ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ ఆమెను బాదించడంతో ఆమె సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.

తప్పకుండా నీ పై అత్యాచారం జరుగుతుంది. నువ్వు వెంటనే చచ్చిపో లేదంటే మనుషులను పంపించి ఎప్పుడైనా చంపించగలను అంటూ ఒక మెస్సేజ్ రావడంతో రియా అసహనం వ్యక్తం చేసింది. ‘దొంగ, హంతకురాలు అని ఎంత దూషించినా కూడా సహించాను. నేను ఆత్మహత్య చేసుకోకుండా సైలెంట్ గా ఉంటే అత్యాచారం చేయిస్తావా’ అంటూ ఆ కామెంట్స్ కి రియా సమాధానం ఇచ్చింది.

అదే విధంగా సైబర్ క్రైమ్ ఇండియా అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.