దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క ప్రేయసి రియా చక్రవర్తి 2020 సెప్టెంబర్ 8 నుండి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణంలో డ్రగ్ యాంగిల్ వెలుగులోకి వచ్చిన తరువాత, రియా డ్రగ్స్ సేకరించినట్లు ఒప్పుకున్న తరువాత పోలీసులు అరెస్టు చేశారు. అయితే బెయిల్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు ఫైనల్ గా ఊరట లభించింది.
బాంబే హై కోర్టు రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇటీవల నటి తన సోదరుడు షోయిక్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ఎన్సిబి అరెస్టు చేసిన బెయిల్ పిటిషన్పై బొంబాయి హైకోర్టు తీర్పును ప్రకటించనుంది. రీసెంట్ గా జ్యుడీషియల్ కస్టడీని 2020 అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 20 వరకు పొడగించారని తెలిసింది. ఒక ప్రత్యేక కోర్టు నార్కోటిక్ డ్రగ్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల పరిధిలోకి తీసుకువస్తుందని అందుకే బెయిల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వచ్చింది. అలాగే NCB అధికారులు కూడా బెయిల్ ఇవ్వకూడదని వారు బయటకు వెళితే సాక్ష్యాలు తారుమరయ్యే అవకాశం ఉందని కోర్టుకు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ రియా ప్రయత్నం ఆగలేదు. ఫైనల్ గా బాంబే కోర్టు నిర్ణయంతో ఆమె కస్టడీ నుంచి విముక్తి లభించింది.