జైలులో ఖైదీల కోసం యోగా సెషన్‌లు నిర్వహించిన రియా చక్రవర్తి

నటి రియా చక్రవర్తికి బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె ఆనందంతో జైలు నుంచి బయటకు వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసు విచారణలో వెలువడిన డ్రగ్ కోణంలో రియాను సెప్టెంబర్ 9, నుండి బైకుల్లా జైలులోనే ఉంచారు. ఆమె బెయిల్ పిటిషన్ను హైకోర్టు 1 లక్ష బాండ్ తో మంజూరు చేసినట్లు టైమ్స్ నౌ మీడియా కథనం ద్వారా తెలిసింది.

ఇక ఆమె న్యాయవాది సతీష్ తన క్లయింట్ రియా కస్టడీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో వివరణ ఇచ్చారు. రియా చక్రవర్తి బైకుల్లా జైలులో ఖైదీల కోసం యోగా సెషన్‌లు నిర్వహించినట్లు తెలిపారు. బార్ల వెనుక నుంచే జైలులో మిగిలిన ఖైదీలతో ఒక సామాన్యురాలిగా ఉన్న రియా అక్కడ నివసించేటప్పుడు మంచి ఉత్సాహంతో ఉందని తెలిపారు. ఇక రియా యొక్క బెయిల్ అభ్యర్ధన అంగీకరించబడగానే న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగి ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక రియాతో పాటు సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, అతనికి సహాయంగా ఉన్న దీపేశ్ సావంత్ కు కూడా బెయిల్ లభించింది. అయితే ఉహీంచని విదంగా ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.