బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానాకు ఆర్జీవీ సపోర్ట్

మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ 4 ముగియనున్న క్రమంలో షో రసవత్తరంగా మారింది. వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు టైటిల్ గెలుస్తారు. ఎవరు రన్నరప్‌గా నిలుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్స్, ఎమోషన్స్ అన్నీ వదిలేసి కంటెస్టెంట్లు అందరూ గేమ్‌పై ఫోకస్ పెట్టారు. అందరూ స్ట్రాంగ్‌గా ఆడుతున్నారు. ఇప్పుడు ఆర్జీవీ కూడా బిగ్‌బాస్‌పై పడ్డారు. అరియానా గ్లోరీకి ఓటు వేసి విన్నర్‌ను చేయాలని ఆయన అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరారు.

rgv

అరియానా బిగ్‌బాస్ టైటిల్‌కు అర్హురాలు అని, ఆమెకు అందరూ ఓటు వేసి గెలిపించాలని ఆర్జీవీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆర్జీవీ కన్ను ఇప్పుడు బిగ్‌బాస్‌పై పడిందని, అరియానాపై కన్నేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నాడు. వర్మ కూడా బిగ్‌బాస్ చూస్తున్నాడంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఆర్జీవీ వల్లే అరియానాకు బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇంటర్వ్యూలో అరియానా థైస్‌పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలతో అరియానా పేరు సోషల్ మీడియాలో మార్మోగ్రిపోయింది. ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేయడంతో ఫేమస్ అయిన అరియానా బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో అరియానాను గెలిపించాలని ఆర్జీవీ కోరడం ఆసక్తికరంగా మారింది.