ఇది మ‌హాభార‌తం కాదు.. కానీ ఇది నా గొంతు కాదు: ఆర్జీవి

వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ గ‌తంలో శివ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు తీసిన‌.. ఆయ‌న ఇప్పుడు మాత్రం ఏ అంశం దొరికినా దానిపై సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. ఎవ‌ర్నీ ఫాలో అవ‌డం న‌చ్చ‌ని ఈ ద‌ర్శ‌కుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక రూటు క్రియేట్ చేసుకుంటారు. కాగా తాజాగా ఆయ‌న ఇది మ‌హాభార‌తం కాదు అనే టైటిల్‌తో వెబ్‌సిరిస్ ప్ర‌క‌టించారు. ఈ వెబ్‌సిరీస్‌కు ర‌చ‌న సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కానీ ఈ వెబ్‌సిరీస్‌కు ప‌ర్య‌వేక్ష‌ణ ఆర్జీవీ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

rgv maha baratham

దీనికి సంబంధించి పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు రాంగోపాల్‌వ‌ర్మ‌. అలాగే ఓ ఆడియోను ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. మ‌హాభారతంలో క‌నిపించే పాత్ర‌లు ప్ర‌పంచంలో ఎక్క‌డో ఒక చోట తార‌స‌ప‌డుతుంటాయ‌ని, తెలంగాణ‌లోని ఓ ప‌ట్ట‌ణంలోనూ అలాంటి వ్య‌క్తులు ఉన్నార‌ని, దీని ఆధారంగా తాము ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నామ‌ని ఆ ఆడియోలో తెలిపాడు వ‌ర్మ‌. అదేవిధంగా ఈ వెబ్‌సిరీస్‌కు ఇది మ‌హా భార‌తం కాదు అని టైటిల్‌ను ఆడియోలో గట్టిగా చెప్పి.. ఈ ఆడియోలో ఉన్న గొంతు త‌న‌ది కాద‌ని.. మ‌హాభార‌తం స‌మ‌యంలో భ‌గ‌వ‌ద్గీత వినిపించిన వ్య‌క్తే త‌న గొంతుక‌ను అనుక‌రించాడ‌ని రాంగోపాల్‌వ‌ర్మ పేర్కొన్నారు. ఇక రామ్‌గోపాల్ వ‌ర్మ పేరుకు ఒక హిస్ట‌రీ ఉంది. దాన్ని అత‌ను ఇప్పుడు మిస్ట‌రీగా మార్చేశారు. టాలీవుడ్ రూపురేఖ‌లు మార్చిన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. మ‌రీ ఇప్పుడు ఇది మ‌హాభార‌తం కాదు వెబ్‌సిరీస్ మొద‌లెట్టాడు.. దీంతో వ‌ర్మ‌ ఏ పేరు తెచ్చుకుంటాడో అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.