టైం అయిపొయింది అన్నారు, ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాడు

రామ్ గోపాల్ వర్మ, పరిచయం అక్కర్లేని పేరు… వివాదాలని, విమర్శలని పక్కన పెట్టి కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడితే వర్మ ఎప్పటికీ సంచలనమే. హిట్ అయితే కొట్టట్లేదు కానీ వర్మ నుంచి సినిమా వస్తుంది అంటే ఇప్పటికీ ఎదురు చూసే వాళ్లు ఉన్నారు. ఎదురు చూసే వాళ్లు ఉన్నారు అనడం కన్నా, వర్మ వెయిట్ చేసేలా చేస్తాడు అనడం కరెక్ట్ గా ఉంటుందేమో. అంతలా ఒక సినిమా గురించి పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, బ్యూటిఫుల్ సినిమాలని రిలీజ్ కి రెడీ చేస్తున్న వర్మ, త్వరలో మరో సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నాడు.

వర్మకి స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే బ్రూస్ లీ అంటే చాలా ఇష్టం, ఆ ఇష్టాన్ని మొదటిసారి తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. బ్రూస్ లీ నటించిన సూపర్ హిట్ మూవీ ఎంటర్ ది డ్రాగన్, అనే టైటిల్ కి ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమాని వర్మ అనౌన్స్ చేశాడు. ఇండో చైనా జాయింట్ కొలాబ్రేషన్ లో రానున్న ఈ మూవీ ట్రైలర్ ని నవంబర్ 27న రిలీజ్ చేయనున్నాడు. బ్రూస్ లీ పుట్టి నవంబర్ 27కి 80 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగానే ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ట్రైలర్ ని, బ్రూస్ లీ పుట్టిన రోజు, పుట్టిన టైంకే అంటే మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ట్రైలర్ ను విడుదల చేస్తానని వర్మ అనౌన్స్ చేశాడు.

ఇది మాత్రమే కాదు, బ్రూస్ లీ హోమ్ టౌన్ అయిన ఫోషన్ సిటీలో ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమాని డిసెంబర్ 13న రిలీజ్ చేయనున్నారు. మన దెగ్గర ఫేడ్ అవుట్ అయ్యాడు అనిపించుకుంటున్న డైరెక్టర్, ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచి ఉంటుంది. ఫస్ట్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే గతంలో కూడా ఆర్జీవీ, బ్రూస్ లీ పేరుతో ఒక సినిమా చేశాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా బయటకి వచ్చి మంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.