వర్మ మళ్లీ మొదలెట్టాడు… మొత్తం చూపించి కనిపెట్టమంటున్నాడు

రామ్ గోపాల్ వర్మ.. కేరాప్ కాంట్రవర్సీ. వివాదాలు విమర్శలతో సావాసం చేసే వర్మ, కాంట్రవర్సీ చేయడు. అతను చేసేదే కాంట్రవర్సీ అవుతుంది. ఇంతకీ ఇప్పుడు ఏం చేశాడు అనే కదా మీ డౌట్, వర్మ ఏదైనా చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ చేసే ఆశ్చర్యం ఎందుకులెండి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వర్మ, మరో సంచలనాన్ని పోస్ట్ చేశారు. అదేంటంటే వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా “కమ్మరాజ్యంలో కడప రెడ్లు”. దీపావళికి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ప్రొమోషన్స్ అంటే ముందుది చేసే వర్మ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నుంచి పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఓ వర్కింగ్ స్టిల్ ను పోస్ట్ చేస్తూ… ఇందులో ఉన్న వారిని సరిగ్గా గుర్తుపడితే మీకు బహుమతి ఇస్తానని క్యాప్షన్ జత చేశారు. అంటే కాకుండా ఈ చిత్ర ట్రైలర్ ను దీపావళి పండుగ రోజున ఉదయం 9.36 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.