సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి వెబ్ సైట్స్ లలో వచ్చే గాసిప్స్ గురించి వర్మ పెద్దగా పట్టించుకోడని అందరికి తెలిసిన విషయమే. కానీ వర్మకు మండితే మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చేస్తాడాని మరోసారి రుజువు చేశాడు. తనకు తీవ్రంగా జ్వరం వచ్చిందని, కరోనా కూడా ఉండవచ్చనే రూమర్స్ వచ్చాయని అయితే ఆ వార్తలను క్రియేట్ చేసిన వారికి ఇదే నా సమాధానం అంటూ వర్కౌట్ చేస్తూ వీడియో వదిలాడు.
ఎవరైతే తనకు అలా జరగాలని కోరుకుంటున్నారో వారి కోరిక నెరవేరనందుకు చింతిస్తున్నాను అంటూ ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని చెబుతూ రెగ్యులర్ గా వర్కౌట్ కూడా చేస్తున్నానని వర్మ కండలను చూపించాడు. చివరగా ఆర్జీవి బూతు పదాన్ని కూడా వాడేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.