అనురాగ్ కి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆర్జీవీ

బాలీవుడ్ లో రోజుకో వివాదం బయటకి వస్తూ అందరికీ లేనిపోనీ తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. డ్రగ్స్ నుంచే కోలుకోని బాలీవుడ్ కి, ఇప్పుడు మళ్లీ మీటు మూవ్మెంట్ రేంజులో షాక్ తగిలింది. అనురాగ్ కశ్యప్ పై పాయల్ గోష్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కి మద్దతుగా చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరిలో అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కూడా ఉన్నారు. పెళ్లి కాకముందు, అయిన తర్వాత, విడిపోయినప్పుడు కూడా అనురాగ్ తనకి చాలా సపోర్ట్ ఇచ్చాడని, ఇలాంటి విషయాలని పట్టించుకోకుండా తన డిగ్నిటీని కాపాడుకోమని కల్కి అనురాగ్ కి మద్దతుగా ట్వీట్ చేసింది.

ఇదే లిస్ట్ లో చేరుతూ రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు. గత 20 ఏళ్లుగా అనురాగ్ తనకి తెలుసనీ చెప్పిన వర్మ, అనురాగ్ చాలా సెన్సిటివ్ పర్సన్ అని అతను ఇలా చేయడం గురించి నేను ఏ రోజు వినలేదని పోస్ట్ చేశాడు. అనురాగ్ పై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కి మాత్రం కామెంట్స్ విచిత్రంగా వస్తున్నాయి. మియా మాల్కోవా వచ్చి మియా ఖలీఫాకి సపోర్ట్ చేసినట్లు ఉంది అంటూ ఒకతను కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా మాత్రం అనురాగ్ కి వ్యతిరేఖంగా ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.