RGV అమ్మాయి చిత్రం చైనాలో 40 వేల థియేటర్‌లలో విడుదల

ఆర్‌జీవీ చిత్రం చైనాలో 40 వేల థియేటర్‌లలో విడుదల
జూలై 15న ఆంధ్రా, తెలంగాణాలో విడుదల అవ్వబోతున్న ఆర్‌జీవీ ‘అమ్మాయి’. ఆయన తీసిన హిందీ చిత్రానికి తెలుగు అనువాదం.


వైవిధ్యభరిత చిత్రాలతోపాటు విభిన్నమైన ప్రయోగాలు చేయడంలో రామ్‌గోపాల వర్మ దిట్ట. తాజాగా మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయి’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలతోపాటు చైనాలోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నారు. హిందీలో ‘లడ్‌కీ’, చైనీస్‌లో ‘గర్ల్‌ ‘డ్రాగన్‌’ పేరుతో అనువదిస్తున్నారు. దుబాయ్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఆర్ట్‌సీ మీడియా, చైనాకు చెందిన బిగ్‌ పీపుల్‌ సంస్థతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ఈ చిత్రం ఐదు భాషల్లో ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేవలం చైనాలోనే 40000 థియేటర్‌లలో విడుదల చేయడం, ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో రిలీజ్‌ చేయడం మొదటిసారి కావడం విశేషం. ఇండియన్‌ స్ర్కీన్‌ మీద భారీ విజయం సాధించిన ‘దంగల్‌’ 9000 థియేటర్లలో, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ 12000, ‘బాహుబలి’ 6000 థియేటర్‌లలో విడుదల కాగా, ‘లడ్‌కీ’ చిత్రం మాత్రం 40000 థియేటర్‌లలో విడుదలకానుంది.

ఈ చిత్రం ఇంటర్‌నేషనల్‌ ట్రైలర్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన బూర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రధాన పాత్రధారి పూజా భాలేకర్‌ ఒరిజినల్‌గా టైక్వాండో నేషనల్‌ ఛాంపియన్‌. అయినప్పటికీ ఈ చిత్రానికి గానూ చైనాలోని షావోలిన్‌ టెంపుల్‌లో ట్రెయిన్‌ అయినవాళ దగ్గర బ్రూస్‌లీ స్టైల్‌ అయినటువంటి జీత్‌ కునేడోలో ట్రైనింగ్‌ ఇచ్చారు.