Saitej Movie: “రిప‌బ్లిక్” పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన మెగా ప‌వ‌ర్‌స్టార్!

Saitej Movie: సుప్రీం హీరో సాయితేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం రిప‌బ్లిక్‌.. దేవా క‌ట్ట ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయితేజ్ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా లాక్‌డౌన్ త‌ర్వాత థియేట‌ర్ల‌లో రిలీజైనా తొలి సినిమా కాగా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం ద‌క్కించుకుంది. అనంత‌రం రిప‌బ్లిక్ సినిమాతో వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా తాజాగా ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తూ.. నా సోద‌రుడు సాయితేజ్‌, డైరెక్ట‌ర్ దేవా క‌ట్ట‌, చిత్ర‌బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

Saitej Latest

ఈ ట్వీట్‌కు సాయితేజ్ స్పందిస్తూ.. త‌న సినిమా పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన రాంచ‌ర‌ణ్‌కు ధ‌న్య‌వాదాలు. పోస్ట‌ర్‌ను లాంచ్ చేస్తావా? అని అడిగిన వెంట‌నే ఆ క్ష‌ణంలోనే ఓకే చెప్పేస్తాడ‌ని అనుకోలేద‌ని.. నీ స‌పోర్టు నాకు ఎంతో గొప్ప‌ద‌ని అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు సాయితేజ్‌. ఇక ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేశ్‌, ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రాన్ని.. భ‌గ‌వాన్‌, పుల్లారావు క‌లిసి నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తుండ‌గా.. జూన్ 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రం రిలీజ్ కానుంది.