పవన్ మాజీ భార్యకు కరోనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్‌కు కరోనా వచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై సోషల్ మీడియాలో రేణూదేశాయ్ స్పందించింది. తనకు నిజంగానే కరోనా వచ్చిందనే వార్తలతో మార్నింగ్ నుంచి ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారంది. నిన్న ఒక ఫంక్షన్‌కు వెళితే అదోలా చూశారని, తనకసలు బాధ్యత లేని మనిషిగా అన్నట్లుగా చూపులతో గుచ్చారంది.

renudesai tests corona

అందుకే ఈ పెస్టు పెడతున్నానని, తనకు కరోనా వస్తే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానంది. బాధ్యతగల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవనని చెప్పింది. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని రాయాలని సూచించింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులకు తెలిపింది. అబద్దాలు సృష్టించే సోషల్ మీడియాలోని అకౌంట్లను అస్సలు ఫాలో అవ్వవద్దని చెప్పింది.