ప్రేమ పాఠాలు చెబుతున్న పవన్ మాజీ భార్య

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగా రేణూదేశాయ్ అందిరికీ తెలుసు. పవన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత విబేధాలు రావడంతో పవన్‌తో విడాకులు తీసుకుని మరో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన రేణూదేశాయ్.. టీవీలలో పలు షోలు చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. అభిమానులతో ఎప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది.

renudesai

అభిమానులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. తాజాగా ప్రేమలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకునేవారికి సోషల్ మీడియాలో రేణూదేశాయ్ ఒక సందేశం అందించింది. జీవితంలో మీ కంటే ఎవరు మీకు కాదని, మీ ప్రాణం అన్నిటికంటే ముఖ్యమని చెబుతోంది. లవ్‌లో ఫెయిల్ అయితే బాధగా ఉంటుందన్న మాట నిజమేనని, ప్రేమలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ నొప్పిన తట్టుకోవడం చాలా కష్టమేనని చెప్పుకొచ్చింది. కానీ దానికి ఆత్మహత్య చేసుకోవడం అనేది మార్గం కాదంది.

ఇలాంటి సమయంలో కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదని, ఆ బాధ నుంచి కోలుకోవడం చాలా ముఖ్యమని రేణూదేశాయ్ చెప్పింది. ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితం మరోక వ్యక్తి కారణంగా ముగియడం కరెక్ట్ కాదని నమ్మండి అని రేణూదేశాయ్ చెబుతోంది.