డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 – ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన
ప్రకాశం జిల్లా
కారంచేడులో జన్మించాడు.
ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ,
స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా
లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు.
జననం : దగ్గుబాటి రామానాయుడు
జూన్ 6, 1936
ప్రకాశం జిల్లా కారంచేడు.
మరణం :2015 ఫిబ్రవరి 18 (వయస్సు 78)
హైదరాబాద్, తెలంగాణ.
మరణ కారణము : కేన్సర్
నివాస ప్రాంతం : హైదరాబాద్
ఇతర పేర్లు : మూవీ మోఘల్.
ప్రసిద్ధి తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత , భారత పార్లమెంటు మాజీ సభ్యుడు.
రాజకీయ పార్టీ : తెలుగుదేశం పార్టీ
మతం : హిందూ
భార్య : రాజేశ్వరి
పిల్లలు: సురేష్, వెంకటేష్.
తండ్రి : వెంకటేశ్వర్లు.
ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు
వ్యక్తిగత జీవితం:
దగ్గుబాటి రామానాయుడు,
1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క, చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు.
ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు.
విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు
మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక
కార్యక్రమాల్లో, కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు. రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.
సినిమా జీవిత
పురస్కారాలు :
పౌర పురస్కారాలు
పద్మ భూషణ్ – 2013
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం బెంగాలీ భాషలో – Asukh – 1999
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం – 2010
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణ భారతదేశం)
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు – జీవనతరంగాలు (1973)
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు – సోగ్గాడు (1975), అవార్డు ప్రదానం (1976)లో
అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొందారు.
1999లో బాపట్ల నుంచి తెదేపా తరఫున ఎంపీగా గెలుపొందారు.
2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు.
మరణం :
చివరి సంవత్సరాల్లో
క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డ రామానాయుడు అదే వ్యాధి వల్ల 18 ఫిబ్రవరి 2015న హైదరాబాద్‌లో మరణించారు. 2002-03 సమయంలో రామానాయుడికి ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో కొన్నాళ్ళపాటు అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015 సమయంలో మళ్లీ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వైద్యులు చికిత్స చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో 2015 ఫిబ్రవరి 15న మరణించారు.
దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన తెలుగు సినిమాలు :
సంవత్సరం/సినిమా పేరు/దర్శకుడు/ప్రధాన తారాగణం.
2015గోపాల గోపాల
కిషోర్ కుమార్ పార్ధసాని
వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీయ
2014దృశ్యం
శ్రీప్రియ
వెంకటేష్, మీనా
2014భీమవరం బుల్లోడు
ఉదయ్ శంకర్
సునీల్, ఎస్తేర్
2013మసాలా
కె. విజయభాస్కర్
వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదమ్సీ.
2013నేనేం చిన్నపిల్లనా?
పి. సునీల్ కుమార్ రెడ్డిరాహుల్ రవీంద్రన్,
తన్వి వ్యాస్, సంజన.
2011ముగ్గురు
వి. ఎన్. ఆదిత్య
నవదీప్, శ్రద్ధ దాస్.
2010ఆలస్యం అమృతం
చంద్రమహేశ్
నిఖిల్, వెంకట్ యాదవ్, అరవింద్ కృష్ణ, మదాలస శర్మ.
2009బెండు అప్పారావ్ ఆర్.ఎం.పి
ఇ.వి.వి. సత్యనారాయణ
అల్లరి నరేష్, జివికే యాదవ్, కామ్న జెఠ్మలానీ, మేఘన.
2008″కౌసల్య సుప్రజ రామ
సూర్య ప్రసాద్
శ్రీకాంత్, శివాజి, ఛార్మి,
గౌరి ముంగల్.
2008బలాదూర్
ఉదయ్ శంకర్
రవితేజ, అనుష్క
2008తులసి
బోయపాటి శ్రీనివాసరావు
వెంకటేష్, నయనతార.
2007″మధుమాసం
చంద్ర సిద్ధార్థ
సుమంత్, స్నేహ,
పార్వతి మిల్టన్
2006శ్రీకృష్ణ
2006విజయేంద్ర ప్రసాద్
శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్
2005సోగ్గాడు
టి. రవి రెడ్డి
తరుణ్, ఆర్తి అగర్వాల్
2005నిరీక్షణ
సీతా రామ్ ప్రసాద్
ఆర్యన్ రాజేష్, శ్రీదేవి.
2005బొమ్మలాట
కె. ప్రకాశ్
సాయికుమార్, శ్రేయ, నరేష్
2004మల్లీశ్వరి
కె. విజయ భాస్కర్
వెంకటేష్, కరినా కైఫ్
2003విజయం
సింగీతం శ్రీనివాసరావు
రాజా, గజాలా
2003నీకు నేను నాకు నువ్వు
రాజశేఖర్
ఉదయ కిరణ్, శ్రేయ.
2003హరివిల్లు
బి. నరసింగరావు
భానుచందర్, హరిత
2002నువ్వు లేక నేను లేను
కాశీ విశ్వనాథ్
తరుణ్, ఆర్తి అగర్వాల్
2002నీ ప్రేమకై
ముప్పలనేని శివ
వినీత్, అబ్బాస్, లయ
2002అల్లరి
టి. రవి రెడ్డి
నరేష్, నీలాంబరి, శ్వేతా అగర్వాల్.
2002హాయ్
ఇ.వి.వి. సత్యనారాయణ
ఆర్యన్ రాజేష్, నికిత.
2001ప్రేమించు
బి. సుబ్బారావ్
సాయి కిరణ్, లయ
2000కలిసుందాం రా
ఉదయ శంకర్
వెంకటేష్, సిమ్రాన్.
2000జయం మనదేరా
ఎన్. శంకర్
వెంకటేష్, వెంకన్న యాదవ్, భానుప్రియ, సౌందర్య.
1999పెద్దమనుషులు
బి. సుబ్బారావు
సుమన్, రచన, హీరా
1999ప్రేయసి రావే
చంద్ర మహేష్
శ్రీకాంత్, రాశి.
1998శివయ్య
సురేష్ కృష్ణ
రాజశేఖర్, సంఘవి, మోనికా బేడీ.
1998గణేష్
తిరుపతి స్వామి
వెంకటేశ్, రంభ, మధుబాల.
1997ప్రేమించుకుందాం రా
జయంత్ సి. పరాంజీ
వెంకటేష్, అంజలీ జవేరీ.
1997సూపర్ హీరోస్
ఎవియస్
ఎవియస్, బ్రహ్మానందం.
1996’ధర్మ చక్రం
సురేష్ కృష్ణ
వెంకటేశ్, రమ్యకృష్ణ, ప్రేమ.
1996ఆహా నా పెళ్ళంట
జంధ్యాల
హరీష్, సంఘవి.
1996నాయుడు గారి కుటుంబం
బి. సుబ్బారావు
సుమన్, కృష్ణంరాజు
1996తాత మనవడు
కె. సదాశివరావు
కృష్ణం రాజు, వినీద్ కుమార్, సంఘవి.
1995కొండపల్లి రత్తయ్య
దాసరి నారాయణరావు
దాసరి నారాయణరావు, హరీష్, ఆమని.
1995తాజ్ మహల్
ముప్పలనేని శివ
శ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవి.
1994తోడి కోడళ్ళు
బి. సుబ్బారావు
సురేష్, మాలాశ్రీ.
1994సూపర్ పోలీస్ కె.మురళీ మోహన రావు
వెంకటేష్, నగ్మా.
1993అక్కా చెల్లెళ్లు
వి.సి. గుహనాధన్
సురేష్, మాలాశ్రీ.
1993’ఆంధ్రవైభవం
ఎమ్.ఆర్. రాజాజీ
డా.డి. రామానాయుడు, మురళీ మోహన్, జమున
1993పరువు ప్రతిష్ట
వి.సి. గుహనాధన్
సుమన్, సురేష్, మాలాశ్రీ.
1992సూరిగాడు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు, సుజాత.
1992ప్రేమ విజేత
కె. సదాశివరావు
హరీష్, రోజా.
1991ప్రేమ ఖైదీ
ఇ.వి.వి. సత్యనారాయణ
హరీష్, మాలాశ్రీ.
1991కూలీ నెం. 1
కె. రాఘవేంద్రరావు
వెంకటేష్, టబు
1991సర్పయాగం
పరుచూరి బ్రదర్స్
శోభన్ బాబు, హరీష్, రోజా.
1990బొబ్బిలి రాజా
బి. గోపాల్
వెంకటేష్, దివ్య భారతి.
1989ఇంద్రుడు చంద్రుడు
సురేష్ కృష్ణ
కమలహాసన్, విజయశాంతి
1988ప్రేమ
సురేష్ కృష్ణ
వెంకటేష్, రేవతి.
1988బ్రహ్మ పుత్రుడు
‘దాసరి నారాయణరావు
వెంకటేష్, రజని
1988చినబాబు
ఎ. మోహన్ గాంధీ
నాగార్జున, అమల.
1987గురుబ్రహ్మ
బి. సుబ్బా రావు
ఎ. నాగేశ్వరరావు, శారద.
1987రాము
వై. నాగేశ్వరరావు
బాలకృష్ణ, రజని
1987కలియుగ పాండవులు
కె. రాఘవేంద్రరావు
వెంకటేష్, కుష్బూ.
1987అహనా పెళ్ళంట
జంధ్యాలరాజేంద్ర ప్రసాద్.
1986ప్రతిధ్వని
బి. గోపాల్
శారద, అర్జున్, రజని
1895శ్రీకట్న లీలలు
పరుచూరి బ్రదర్స్
చంద్రమోహన్, తులసి.
1985మాగల్యబలం
బి. సుబ్బారావుశోభన్ బాబు, జయసుధ.
1984సంఘర్షణ
కె. మురళీ మోహన రావు
చిరంజీవి, విజయశాంతి, నళిని.
1984కథానాయకుడు
కె. మురళీమోహన రావు
బాలకృష్ణ, విజయశాంతి.
1983ముందడుగు
కె. బాపయ్యశోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద.
1982దేవత
కె. రాఘవేంద్రరావుశోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి.
1981అగ్నిపూలు
కె. బాపయ్యకృష్ణంరాజు, జయసుధ.
1981ప్రేమ మందిరం.
దాసరి నారాయణ రావుఎ.ఎన్.ఆర్, జయప్రద.
1980కక్ష
విసి. గుహనాథన్
శోభన్ బాబు, వాణిశ్రీ.
1979మండే గుండెలు
కె. బాపయ్యశోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి.
1979ఒక చల్లనిరాత్రి
కె.వాసుచంద్రమోహన్,మాధవి.
1978చిలిపి కృష్ణుడు
బి.సుబ్బారావుకాంతారావు,రాజశ్రీ.
1978ఎంకి నాయుడుబావ
బి.సుబ్బారావుశోభనబాబు,వాణిశ్రీ.
1977సావాసగాళ్ళు
బి.సుబ్బారావుకృష్ణ,జయచిత్ర
1977మొరటోడు.
సికే నగెష్
సత్యనారాయణ,జయసుధ.
1976సెక్రటరి
ఎస్ ప్రకాష్ రావుఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ.1975అమ్మాయల శపథము
జిచిఆర్ శేషగిరి రావుచంద్రమోహన్,లక్ష్మి.1975సోగ్గాడు
కె,బాపయ్యశోభన్బాబు,జయచిత్ర.
1974చక్రవాకం
వి.మధుసూదన రావుశోభన్బాబు,వాణిశ్రీ.
1973జీవనతరంగాలు
టి.రామారావుశోభన్బాబు,వాణిశ్రీ.
1971ప్రేమనగర్.
కె.ఎస్.ప్రకాశరావుఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ.
1970ద్రోహి
కె.బాపయ్యజగ్గయ్య,వాణిశ్రీ.
1969బొమ్మలు చెప్పిన కథ
జి.విశ్వనాథంకాంతారావు,విజయనిర్మల.
1969సిపాయి చిన్నయ్య.
జివిఆర్ శేషగిరి రావుఎ.నాగేశ్వరరావు,కెఆర్ విజయ.
1968పాప కోసం
జివిఆర్ శేషగిరి రావుజగ్గయ్య, దేవిక.
1967స్త్రీ జన్మ
కె.ఎస్.ప్రకాశరావుఎన్.టి.రామారావు,కృష్ణకుమారి.
1966శ్రీ కృష్ణ తులాభారం
కె.కామేశ్వరరావుఎన్.టి.రామారావు,జమున.
1965ప్రతిజ్ఞాపాలన
సి.యస్. రావుకాంతారావు, రాజశ్రీ.
1964రాముడు భీముడు
తాపి చాణక్యఎన్.టి.ఆర్, జమున, సావిత్రి.
1963అనురాగం
జి. రామినీడుజగ్గయ్య, భానుమతి.
బొబ్బిలి ఫిల్మ్ సొసైటీ
ప్రముఖ నిర్మాత, స్టూడియో అధినేత అయిన డి.రామానాయుడుగారి
జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ …💐💐💐🙏🙏🙏
Home సినిమా వార్తలు ప్రముఖ నిర్మాత, స్టూడియో అధినేత అయిన డి.రామానాయుడుగారిజయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ