Regina: ఒక్క హిట్ కావాలి.. అవ‌కాశాలు లేక విల‌విలాడుతున్న రెజీనా!

Regina: హీరోయిన్ రెజీనా కాసాండ్రా శివ మ‌నసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కానీ ఈ చిత్రం బాగా ఆడ‌లేదు.. అలాగే రెజీనా అంటే ఎవ‌రో కూడా తెలియ‌దు. ఆ త‌ర్వాత రోటీన్ ల‌వ్‌స్టోరీ సినిమాలో హీరోయిన్‌గా చేసింది Regina రెజీనా.. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది. అనంత‌రం మెగా హీరో సాయితేజ్ న‌టించిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మణ్యం ఫ‌ర్ సేల్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ, భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుందిRegina.

regina cassandra

అయితే ఇప్పుడు రెజీనా ప‌రిస్థితి దారుణం.. ఆమె చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు.. ఆమె చివ‌రి చిత్రం ఎవ‌రు సినిమా కాగా.. సినిమా అవ‌కాశాలు లేక రెజీనా విల‌విలాడుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో కోలీవుడ్ నుంచి పిలుపు వ‌చ్చింది.. ప్ర‌స్తుతం Regina రెజీనా నెంజ‌మ్ మ‌ర‌ప్ప‌తిల్లై చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది.. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతుండ‌గా.. మార్చి 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హర్ర‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుండ‌గా.. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.. దీంట్లో Regina రెజీనా ప‌ర్ఫార్మెన్స్ ఎంతో అల‌రిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎస్‌.జె సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితేనే రెజీనా త‌మిళంలోనైనా బిజీగా ఉంటుంది క‌దా. లేదంటే తెలుగులో అవ‌కాశాలు లేక ఉన్నాదో, త‌మిళ్‌లో కూడా కెరీర్ డ‌ల్ అయిపోయే అవ‌కాశం ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి, Regina రెజీనా భ‌విష్య‌త్తు ఎలా తిరుగుతుందో చూడాలి మ‌రీ.