Regina Casandra: రేస్‌లో గెలిచి ప్రైజ్ అందుకున్న రెజీనా..

Regina Casandra: రెజీనా కాసాండ్రా టాలీవుడ్‌లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హీరోయిన్‌.. సాయితేజ్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య‌ఫ‌ర్ సేల్‌తో మంచి విజ‌యం అందుకుంది ఈ అమ్మ‌డు.. ఇక ఈ బ్యూటీ అందాలు మాముల‌గా ఉండ‌వు.. త‌న హాట్ హాట్ అందాల‌తో రెచ్చిపోతుంది.. ప్ర‌స్తుతం తెలుగులో ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాయి.. దీంతో త‌మిళ్ ఇండ‌స్ట్రీకి వెళ్లింది.. కాగా ఆమె న‌టిస్తున్న ఓ సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డం వ‌ల‌న తాజాగా ఓ వాట‌ర్ స్పోర్ట్స్ గేమ్‌ రేస్‌లో పాల్గొని ప్రైజ్ గెలుచుకుంది.

Regina Casandra

ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టా వేదిక‌గా తెలిపింది రెజీనా. ఈ ఆదివారం నాడు చెన్నైలో స్టాండ‌ప్ ప‌డిల్ రేసులో పాల్గొన్నా. నిజానికి ఆరోజు నేను చెన్నైలో ఉండాల్సింది కాదు.. తాను న‌టిస్తున్న సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డం వ‌ల‌న ఇంటికి వ‌చ్చాను. దీంతో ఏదో స‌ర‌దాగా నా ఫ్రెండ్స్‌తో ఈ ఆట‌లో పాల్గొన్నాను. మొత్తానికి రేస్‌లో విన్న‌ర్‌గా నిలిచాను అంటూ రాసుకొచ్చింది రెజీనా. ఇక ఆమె తెలుగులో ఆచార్య చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది.