ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకుడు. కృష్ణ పోతినేని చిత్రసమర్పకులు. సెన్సేషనల్ బ్లాక్బస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న చిత్రం ఇది.
చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ..”ఇప్పటి వరకూ రామ్ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. గోవా ,హైదరాబాద్, వైజాగ్ ల్లో జరిపిన షూటింగ్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఇటలీలో రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నాం. ఈ నెల 12 నుంచి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలో మైట్స్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం . హీరో రామ్, మాళవిక శర్మ ల పై రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం . ఈ నెల 20వరకు చిత్రీకరణ జరుగుతుంది . శోభి మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత మరో పాటని చిత్రీకరించనున్నాం . దాంతో షూటింగ్ మొత్తం పూర్తైనట్లే. మరోపక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముందే అనౌన్స్ చేసినట్లు ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నాం ” అని తెలియజేశారు.
రామ్, నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్: జునైద్.