అరవింద్ స్వామి డబ్బింగ్ అందుకేనా?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. అక్టోబ‌ర్ 2న సినిమాను తెలుగు,త మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయబోతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ని చిరంజీవి 20 గంటల్లో పూర్తి చేయగా, తమన్నా హిందీ డబ్బింగ్ ని పూర్తి చేసింది. చ‌రిత్ర పుటల్లో కాన‌రాని రేనాటి సూర్యుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన మొట్ట‌మొద‌టి యోధుడు ఓ తెలుగువాడు కావ‌డం మ‌న గొప్ప‌గా చెప్పుకునే సమయం ఇది. అన్ని భాషల్లో డబ్ అవనున్న సైరా సినిమాకి త‌మిళంలో మెగాస్టార్ చిరంజీవి కోసం అర‌వింద‌స్వామి డ‌బ్బింగ్ చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర‌కు త‌మిళంలో ఎవ‌రితో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని రామ్‌చ‌ర‌ణ్ ఆలోచిస్తున్న సమయంలో అర‌వింస్వామి స్వ‌యంగా ఫోన్ చేసి చిరు పాత్రకి తాను డ‌బ్బింగ్ చెబుతాన‌ని కోరాడ‌ట‌. ధృవ సినిమాలో చ‌ర‌ణ్‌, అర‌వింద‌స్వామి క‌లిసి ప‌నిచేశారు. అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉండ‌టంతో అర‌వింద‌స్వామి రిక్వెస్ట్‌ను చ‌ర‌ణ్ కాద‌న‌లేక‌పోయాడ‌ట. పైగా అరవింద్ స్వామి గొంతులో లౌడ్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంటెన్స్ తో కూడిన డైలాగ్స్ చెప్పడంలో ఆయన దిట్ట కాబట్టి చిరు కూడా అరవింద్ స్వామి రిక్వెస్ట్ కి ఓకే అన్నడట. త్వరలో సైరా తమిళ డబ్బింగ్ మొదలు పెట్టనున్న అరవింద్ స్వామి, తన గొంతుతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కొత్త ఊపిరి అద్దుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.