బౌలర్లు కాపాడిన మ్యాచ్

ఐపీఎల్ 2020 మ్యాచ్ 3 బెంగళూరు హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ముందు రెండు మ్యాచులు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని తలపిస్తే, ఈ మ్యాచ్ మాత్రం వన్ సైడెడ్ గానే సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు 20 ఓవర్లకి 163 పరుగులు చేసింది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు టీం ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దేవదూత్, డీవీలర్స్ హాఫ్ సెంచరీస్ చేసి హైదరాబాద్ బౌలింగ్ ని ఎదురుకున్నారు. వీరికి కోహ్లీ కూడా తోడై ఉంటే బాగుండేది కానీ హైదరాబాద్ బౌలర్లు కోహ్లీని సక్సస్ ఫుల్ గా కట్టడి చేశారు. 164 టార్గెట్ తో ఛేజింగ్ కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో వన్ డౌన్ గా క్రీజ్ లోకి వచ్చిన మనీష్ పాండే బెయిర్ స్ట్రోతో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వికెట్ కాపాడుకున్నాం ఇక గేర్ మర్చి చెలరేగుదాం అనుకునే లోపు హైదరాబాద్ టీంకి షాక్ ఇస్తూ చాహల్ మనీష్ పాండేని ఇంటికి పంపించాడు. ఆ తర్వాత ఏ దశలో ఛేజింగ్ సైడ్ కనిపించని హైదరాబాద్, పేక మేడని తలపిస్తూ వరసగా వికెట్స్ కోల్పోయింది. చాహల్ క్రమం తప్పకుండా వికెట్స్ తీస్తూ ఉంటే, నవదీప్ సైనీ మంచి లైన్ అండ్ లెంగ్త్ మైంటైన్ చేస్తూ బ్యాట్స్ మన్ ని కట్టడి చేశాడు. ఈ బౌలింగ్ ద్వయం దెబ్బకి హైదరాబాద్ టీం 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. అక్కడక్కడా మిస్ ఫీల్డింగ్స్ చేసినా కూడా బౌలర్ల కన్సిస్టెన్సీ బెంగళూరు టీంని విజయతీరాలకు చేర్చింది.

మూమెంట్ ఆఫ్ ది డే: మనీష్ పాండే బెయిర్ స్ట్రో నిలకడగా ఆడుతూ హైదరాబాద్ ని గెలిపిస్తారు, బెంగళూరు టీం నుంచి విజయం దూరమవుతుంది అనుకునే టైములో కోహ్లీ తన ట్రంప్ కార్డు యుజివిందర్ చాహల్ కి బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ చాహల్, మనీష్ వికెట్ తీశాడు. 11.6 ఓవర్ లో మనీష్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతికి వచ్చేసింది.

ప్లేయర్ టు వాచ్ అవుట్: బెంగళూరుతో మ్యాచ్ అంటే ఏ టీం అయినా కోహ్లీ, డీవీలర్స్ లని ఎలా అడ్డుకోవాలా అని ప్రణాలిక రచిస్తూ ఉంటారు. ఈరోజు హైదరాబాద్ కూడా అలానే ప్రిపేర్ అయి ఉంటారు కానీ ఎవరూ ఊహించని విధంగా, యంగ్ ఇండియన్ ప్లేయర్ దేవ్ దూత్ పడిక్కల్ మెరుపులు మెరిపించాడు. కర్ణాటక టీం తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడే పడిక్కల్ 42 బంతుల్లో 56 పరుగులు చేసి బెంగళూరు టీంకి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఆన్ సైడ్ అండ్ ఆఫ్ సైడ్ పర్ఫెక్ట్ షాట్స్ కొట్టిన పడిక్కల్, నెక్స్ట్ మ్యాచ్ నుంచి తనని కూడా కన్సిడర్ చేయమన్నట్లు అపోజిట్ టీమ్స్ కి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పడిక్కల్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే నియర్ ఫ్యూచర్ లోనే అతన్ని బ్లూ జెర్సీలో చూడగలం.