మాస్ మహారాజ రవితేజ ఇసుకలో డిస్కో…

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రూపొందుతోన్న లేటెస్ట్ ఫిల్మ్ డిస్కోరాజా. ఇప్పటి వరకూ థ్రిల్లర్ చిత్రాలని తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో రెడీ అవుతున్న రివేంజ్ డ్రామా. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 20న విడుద‌ల రెడీ అవుతున్న ఈ మూవీని ఎస్.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్‌తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా మొదలైన డిస్కో రాజా గోవా షెడ్యూల్ పూర్త‌య్యింది. గోవా షెడ్యూల్ పూర్తి అవ్వడంతో రవితేజ హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ సంద‌ర్భంగా సినిమా ఆర్ట్ డైరెక్ట‌ర్ డిస్కోరాజా అనే టైటిల్‌ను ఇసుక‌లో డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్త‌యిన‌ట్లేనని తెలుస్తోంది. చూడగానే అట్రాక్ట్ చేసేలా ఉన్న ఈ సాండ్ డిజైన్ మాస్ మహారాజ్ అభిమానులని ఆకట్టుకుంటోంది. రవితేజ సరసన న‌భా న‌టేశ్‌, పాయల్ రాజ్‌పుత్‌, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా న‌టించారు.