ఐదోసారి యూనిఫామ్ వేసుకుంటాడా?

రీసెంట్ గా డిస్కో రాజా సినిమా పనులు పూర్తి చేసిన మాస్ మహారాజ్ రవితేజ, డాన్ శీను డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే గతంలో డాన్ శ్రీను పాత్రలో నవ్వించిన రవితేజ, ఈసారి మాత్రం పోలీస్ ఆఫీసర్ గా రఫ్ఫాడించనున్నాడు. ఇప్పటికే విక్రమార్కుడు, ఖతర్నాక్, పవర్, టచ్ చేసి చూడు సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించి మెప్పించాడు. ముఖ్యంగా విక్రమార్కుడు, పవర్ సినిమాల్లో తన మార్క్ డైలాగ్ డెలివరీతో నవ్విస్తూనే కంప్లీట్ సీరియస్ సీన్స్ లో థియేటర్స్ లో విజిల్స్ పడే రేంజులో డైలాగులు చెప్పాడు. మరి గోపీచంద్ మలినేని రవితేజని ఆ రేంజులో చూపిస్తాడో లేదో చూడాలి. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలోని ‘డిస్కో రాజా’ చిత్రం రిలీజ్ అయ్యాక రవితేజ గోపిచంద్ మలినేని చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రీసెంట్ గా ఈ మూవీ కోసమే గోపీచంద్ మలినేని, కొత్త టీంని కూడా తీసుకున్నాడు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.