ఆ రూల్‌ని పక్కన పెట్టిన రవితేజ

క్రాక్ సినిమా సక్సెస్‌తో మంచి జోరు మీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేశాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి అనే సినిమాలో రవితేజ నటిస్తుండగా.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

RAVITEJA LIP LOCK

ఖిలాడి సినిమాలో లిప్ లాక్ సీన్‌లో రవితేజ నటించనున్నాడట. తొలుత లిప్ లాక్ సీన్ చేసేందుకు రవితేజ నో చెప్పాడట. కానీ ఒక సీన్‌కు అది అత్యంత అవసరం అని డైరెక్టర్ చెప్పడంతో.. లిప్ లాక్ సీన్‌లో నటించేందుకు రవితేజ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. లిప్ లాక్ సీన్లను రవితేజ చాలా దూరంగా ఉంటాడు. కానీ ఈ సినిమా కోసం రవితేజ ఆ రూల్‌ని పక్కన పెట్టాడట.