Raviteja: మ‌రో చిత్రంకు ఓకే చేసిన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌!

Raviteja: మాస్‌మ‌హరాజ్ రవితేజ వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఆయ‌న న‌టించిన క్రాక్ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. క్రాక్ చిత్రంతో ర‌వితేజ మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు. దీంతో వ‌రుస సినిమాలకు ఓకే చెప్తున్నాడు.. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రానికి ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే.. మ‌రో చిత్రానికి సైన్ చేశాడు Ravitejaర‌వితేజ‌.

raviteja updates

సినిమా చూపిస్తా మావ‌, నేను లోక‌ల్‌, హ‌లో గురు ప్రేమ‌కోస‌మే వంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న త్రినాథరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ చిత్రాన్ని చేయ‌నున్నాడు.. ఈ విష‌యాన్ని ఈ చిత్రాన్ని నిర్మించే అభిషేక్ అగ‌ర్వాల్, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ తెలిపారు. మార్చి రెండో వారం నుంచి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. ర‌వితేజ శైలి మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్న‌ట్టు స‌మాచారం. ఇక Ravitejaర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ఖిలాడీ మే 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.