రికార్డు క్రియేట్ చేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించగా.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

raviteja krack movie screens
raviteja krack movie screens

సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయున్నారు. రవితేజ నటించిన గత రెండు సినిమాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఈ సినిమాపై రవితేజతో పాటు ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

ఈ క్రమంలో రవితేజ క్రాక్ సినిమా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రవీతేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు రవితేజ నటించిన ఏ సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు.