FLASH: ‘క్రాక్’ సినిమా విడుదల వాయిదా?… సంక్రాంతికి రిలీజ్?

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా విడుదల వాయిదా పడినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్మాత ఠాగూర్ మథుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఇంకా సెటిల్ కాకపోవడంతో.. మార్నింగ్ షోలు రద్దు చేశారు. మ్యాట్నీ షోలు మొదలవుతాయని రవితేజ అభిమానులు ఆశించారు. కానీ మ్యాట్నీ షోలు కూడా ప్రారంభం కాకపోవడంతో థియేటర్లు వచ్చిన రవితేజ అభిమానులు నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారు.

RAVITEJA KRACK MOVIE POSTPONED

ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి రీఫండ్ ఇస్తున్నారు. దీంతో సినిమా విడుదల అయిందా?.. లేదా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ సినిమా విడుదల లేదని, నిర్మాతకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు పరిష్కారం అయితే రేపు విడుదల అవుతుందని వార్తలొస్తున్నాయి.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ ఈ పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. 1100 స్క్రీన్లలో ఈ సినిమాను భారీగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ నిర్మాత ఠాగూర్ మధు ఆర్థిక వ్యవహారాలు ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాను 13న లేదా 14న విడుదల చేసే అవకాశముందని సోషల్ మీడియాలో ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.