రవితేజ ఈగల్ నుండి 3వ సింగల్

మాస్ మహారాజా రవితేజ రాబోయే సినిమా ఈగల్. అయితే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఫిబ్రవరిలో రావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే రవితేజ లుంగీ కట్టుకుని గన్స్ తో చేస్తున్న పైట్ కానీ రవితేజ లుక్స్ ఇంకా నవదీప్ యొక్క ఎలివేషన్ కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ లభించగా, ఇప్పుడు ఈ సినిమా నుండి 3వ సింగిల్ విడుదల కానుంది. ఈనెల 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా మూడవ పాట విడుదల కానుంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లో నిర్మించబడిన ఈ సినిమా రవితేజతో జంటగా కావ్య టప్పర్ నటించిన. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.