సంక్రాంతికి ఫిక్స్ అయిన మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ హీరోగా రానున్న “క్రాక్” సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. జనవరి 14న ‘క్రాక్’ సినిమా విడుదల అవుతుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల అవుతుందన్నారు.

RAVITEJA

థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ‘క్రాక్’ సినిమాలోని రవితేజ్ లుక్‌లు విడుదలవ్వగా.. ఇందులో రవితేజ డిఫరెంట్‌గా కనిపించాడు.

లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా ఈ నెలలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదల కానుంది. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న తొలి స్టార్ హీరో సినిమా ఇదే. ఇక సంక్రాంతికి రవితేజ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశముంది.