ఆవిరి టీజర్ వచ్చేది ఆ రోజే

టాలీవుడ్ లో ఉన్న వైవిధ్యమైన దర్శకుల్లో రవిబాబు ఒకరు. గతంలో ఎన్నో హిట్స్ అందుకున్న రవిబాబు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ఆవిరి. హారర్ సినిమాలను తెరక్కించడంలో తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసిన రవిబాబు మరోసారి అదే జోనర్ ని నమ్ముకొని ఆవిరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముక్తార్ ఆవిరి సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఆవిరి సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన రవిబాబు, తన మార్క్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

ఒక ప్రెజర్ కుక్కర్ లో అమ్మాయి కళ్లని పెట్టి రవిబాబు స్టైల్ లోనే డిజైన్ చేసిన పోస్టర్ బాగుంది. ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన రవిబాబు ఇప్పుడు టీజర్ సిద్దం చేశారు. ఈ నెల 28న ఆవిరి టీజర్ విడుదల కానుంది. టీజర్ తోనే తన సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసే రవిబాబు, ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి. అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.