సరిలేరు నీకెవ్వరూ నుంచి రష్మిక లుక్ లీక్ అయ్యింది…

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. మహేశ్ మేజర్ అజయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ నుంచి రష్మిక లుక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రెడ్ కలర్ లంగా ఓణిలో రష్మిక చాలా అందంగా ఉంది. కంప్లీట్ మేకప్ అయ్యి షాట్ కి రెడీ అవుతొందో లేక అప్పుడే లొకేషన్ కి వచ్చిందో తెలియదు కానీ రష్మిక లీక్ అయిన ఫొటోస్ చూడగానే యూత్ అంతా చూసి చూడంగానే నచ్చేశావే అంటూ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ సెట్స్ నుంచి లీక్ అయిన రష్మిక ఫొటోస్ ని మీరు కూడా చూడండి.