దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో స్వప్న సినిమా ప్రొడక్షన్ నెం 7 లో రష్మిక మందన్న పాత్ర లుక్ విడుదల

హృదయాన్ని హత్తుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లను రూపొందించడంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం హీరో దుల్కర్ సల్మాన్ ను అదే తరహాగా చిత్రం లో లెఫ్టినెంట్’ రామ్ గా చూపించబోతున్నాడు.

మృణాళిని ఠాకూర్ అతనికి జోడీగా సీత పాత్ర లో కనిపించనుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

రష్మిక, పుట్టినరోజు సందర్భంగా నేడు రష్మిక మందన్నను ప్రాజెక్ట్‌ లో భాగమని వెల్లడించడం ద్వారా మేకర్స్ పెద్ద సర్ప్రైజ్ చేసారు. అంతేకాదు, ఇది ఆమెకు రెగ్యులర్ పాత్ర కాదు. ఆమె అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం అమ్మాయి గా వీరోచిత పాత్రలో కనిపిస్తుంది.

పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ లో రష్మిక మందన్న కాలిపోతున్న కారు ముందు నడుస్తూ ఉంటుంది. ఆమె ఎరుపు రంగు హిజాబ్ ధరించి, హ్యాండ్‌బ్యాగ్‌ ని కలిగి, ఆమె కళ్లలోని సీరియస్ నెస్, తీవ్రతను స్పష్టం చేస్తుంది.

విశాల్‌ చంద్రశేఖర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆ పాత్రను ఆకట్టుకునేలా చేసింది.

స్వప్న సినిమా ప్రొడక్షన్ నెం 7 గా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.

దుల్కర్ మరియు మృణాళిని పాత్రలను పరిచయం చేయడానికి ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ లు చిత్రంపై చాలా ఆసక్తి కలిగించగా, రష్మిక మందన్న యొక్క గ్లింప్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది.

భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: హను రాఘవపూడి HV

నిర్మాతలు: అశ్విని దత్, ప్రియాంక దత్

బ్యానర్: స్వప్న సినిమా

సమర్పకులు: వైజయంతీ మూవీస్

DOP: PS వినోద్

సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు

ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

PRO: వంశీ-శేఖర్