నేషనల్ క్రష్ రష్మిక చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ నుంచి ‘యూ ఆర్ మై డీపీ’ పాట విడుదల

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.  మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని జూలై 21న రిలీజ్ చేయబోతోన్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను మేకర్లు రిలీజ్ చేశారు. యూ ఆర్ మై డీపీ అంటూ సాగే ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సురేష్ గంగుల రాసిన ఈ పాట, భీమ్స్ ఇచ్చిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. సాయి మాధవ్, స్వాతి రెడ్డిలు ఆలపించిన ఈ పాట అందరినీ అలరించేలా ఉంది.

ఇక ఈ పాటలో సంజయ్ రావు స్టైలింగ్, ఆయన వేసిన స్టెప్పులు, ప్రణవి మానుకొండ లుక్స్ బాగున్నాయి. చూస్తుంటే ఈ లిరికల్ వీడియోలో యూట్యూబ్‌లో కచ్చితంగా ట్రెండ్ అయ్యేట్టుగా ఉంది.

ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.
ఎడిటర్ – వైష్ణవ్ వాసు
సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి
పీఆర్వో – జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి
బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ
సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల
ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం