అలా చేస్తే మీరు నాకు దూరం అవుతారు-రష్మిక

చలో, గీత గోవిందం సినిమాలతో కుర్రాళ్ల మనసు దోచేసిన కన్నడ బ్యూటీ రష్మీక మందన్న భీష్మ సరిలేరు నీకెవరు చిత్రాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. అందం అభినయం రెండూ కలిసుండే రష్మికని సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కొందరు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా చాలా పాజిటివ్ గా తీసుకునే రష్మిక, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఆ పోస్ట్ లో రష్మిక, తాను ఎప్పుడూ నవ్వుతూ ఉంటానని… తన లైఫ్ లో ఏం జరిగిన పాజిటివ్ గా చేసుకుంటానని చెప్పింది.

మంచైనా చెడైనా నవ్వుతూనే రిసీవ్ చేసుకుంటానని చెప్పిన రష్మిక, తన ఫేస్ పై సీరియస్ నెస్ కానీ మూడ్ స్వింగ్స్ ని కానీ ఇప్పటివరకూ ఎవరు చూసి ఉండరని చెప్పింది. తెలియని మనిషిని చూసి నవ్వే వాళ్ళని మీరు పిచ్చోళ్లలాగా చూస్తే, నేను మీకు దూరం అవుతాను ఎందుకంటే నేను తెలియని మనుషులు ఎదురైనా కూడా నవ్వుతూనే పలకరిస్తాను అంటూ పాజిటివ్ నెస్ ని స్ప్రెడ్ చేసే ట్వీట్ చేసింది.