రష్మికకు మరో అరుదైన ఘనత

కరోనా వల్ల ఈ ఏడాది అందరికీ బ్యాడ్ ఇయర్ అయింది. కానీ అందాల బ్యూటీ రష్మికకు మాత్రం ఈ ఇయర్ గుడ్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ ఏడాదిలోమహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హిట్ అందుకుంది రష్మిక. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ కొట్టేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు శర్వానంద్‌తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది.

RASHMIKA MANDANNA

ఇక ఇటీవలే బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా చేస్తున్న మిష‌న్ మ‌జ్ను సినిమాలో హీరోయిన్‌గా రష్మికకు అవకాశం దక్కింది. ఇక అమితాబ్ బచ్చన్‌తో వికాస్ భల్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో అమితాబ్ కూతురిగా రష్మిక నటించనుందని తెలుస్తోంది.

ఇలా బంపర్ ఆఫర్స్ కొట్టేస్తున్న రష్మిక గూగుల్‌లో ఇటీవల అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఇయర్‌లో గూగుల్ మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్‌, నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా నిలిచింది. అయితే తాజాగా రష్మిక మరో ఘనతను సొంతం చేసుకుంది. హీరోయిన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.