రష్మికకు బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది రష్మిక మందన్నా. స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాతో పాటు శర్వానంద్ నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక తమిళంలో కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్’ సినిమాలో కూడా నటిస్తూ కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని చూస్తోంది.

rashmika mandanna

ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా వస్తున్న ‘మిష‌న్ మ‌జ్ను’ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 1970వ సంవత్సరంలో జరిగిన కోవర్ట్ ఆఫరేషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇందులో సిద్దార్థ్ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. షంతాను బాచి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనుండగా.. రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు.

కాగా, గతంలోనే రష్మికకు బాలీవుడ్‌లో ఆఫర్ రాగా.. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. గతంలోనే జెర్సీ హిందీ రీమేక్‌లో రష్మికకు అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో.. రష్మిక బాలీవుడ్ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు ఎట్టకేలకు రష్మిక బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది.