రష్మిక సంచలన కామెంట్స్

రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రానున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మికకు హీరోయిన్‌గా వచ్చింది. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

rashmika mandanna comments

శాంతను బాగ్చి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించనున్నాడు. ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో కూడా రాణిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ఇక తమిళంలో కార్తీ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో తమిళంలోకి కూడా రష్మిక అడుగుపెట్టనుంది.

అయితే తాజాగా ట్విట్టర్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఫ్యూచర్ సినిమాల గురించి ఇప్పట్లో చెప్పలేనని, తాను చెప్పినప్పుడే అ సినిమాల విషయాలు బయటికి వస్తాయంటూ చెప్పుకొచ్చింది.