Rashmika: పొలం ప‌నుల్లో ర‌ష్మిక మంద‌న్నా..

Rashmika: ప్ర‌ముఖ క‌థానాయిక‌ రష్మిక మంద‌న్న తన ఇన్‌స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది. దీంట్లో ర‌ష్మికా పంట పొలాల్లో వ్య‌వ‌సాయం చేస్తూ క‌నిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళితే.. కోలీవుడ్ హీరో కార్తీ న‌టిస్తున్న తాజా చిత్రం సుల్తాన్‌. ఈ చిత్రంతో హీరోయిన్‌గా త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతుంది ర‌ష్మిక మంద‌న్నా. ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డుతుంది. ఏకంగా పంట పొలాల్లో ట్రాక్ట‌ర్‌తో దున్నుతూ మ‌రీ క‌ష్ట‌ప‌డుతుంది.

దీనికి సంబంధించిన వీడియోను త‌నRashmika ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకుంది రష్మిక. సాహిత్యం వింటూ ఈ వీడియో చూడండి.. నేను ఈ ప్ర‌త్యేక‌మైన స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు స‌రిగ్గానే ఆలోచిస్తున్నాను. ఈ పాత్ర‌ను నేను ఎంత‌గా ఎంజాయ్ చేశానో మీరు చూస్తార‌నే అనుకుంటున్నాను.. అంటూ కామెంట్ చేసింది ర‌ష్మిక‌. కార్తీ, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తున్న సుల్తాన్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌‌