న్యూఇయ‌ర్‌కు కొత్త కారును కొనుగోలు చేసిన ర‌ష్మిక‌!

ర‌ష్మిక మంద‌న్నా తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్ భాష‌ల‌లో ప‌లు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. తాజాగా ఆమె కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విలాస‌వంత‌మైన రేంజ్ రోవ‌ర్ కారును కొనుగోలు చేసింది. ఈ విష‌యాన్ని ర‌ష్మిక సోష‌ల్‌మీడియా ద్వారా తెలియ‌జేసింది. త‌న‌కెంతో ఇష్ట‌మైన రేంజ్ రోవ‌ర్ ఎస్ యూవీ కారు ముందు చిల్ చేస్తూ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని దిగిన ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌ ర‌ష్మిక 2020లో స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి రెండు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ భామ ప్రస్తుతం శ‌ర్వానంద్ హీరోగా ఆడాళ్లు మీకు జోహ‌ర్లు సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఈ సినిమా కోసం ర‌ష్మిక ఏకంగా 2కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంద‌నే వార్తా టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అలాగే ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లోకి సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా మిష‌న్ మ‌జ్ను చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నా విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని శాంత‌ను బాగ్‌చి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ రోన్నీ స్క్రూవాలా, అమ‌ర్ బుటాలా, గ‌రిమా మెహ‌తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.