యంగ్ హీరోతో రెడీ అంటున్న రష్మిక

టాప్ హీరోయిన్ రష్మిక అక్కినేని అఖిల్‌తో రోమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ సినిమా చేస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను తీసుకున్నట్లు సమాచారం. ఎకే ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు.

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు స్టోరీ అందించాడు. వచ్చే నెలలో దీని షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో రష్మిక నటిస్తోంది. దీంతో పాటు ఆడాళ్లు మీకు జోహర్లు అనే సినిమాలో శర్వానంద్ పక్కన నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు అఖిల్ సినిమాలో కూడా రష్మిక నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అఖిల్-‘సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.