ప్రేమికుల రోజు ఇవి గిఫ్ట్‌గా ఇవ్వొద్దు

మరికొద్దిరోజుల్లో ప్రేమికుల రోజు రాబోతోంది. దీంతో ప్రేమికులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. లవర్స్ ఒకరికొకకు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ సందడి చేస్తూ ఉంటారు. కొందరు పెట్ డాగ్స్, క్యాట్స్‌ను బహుమతిగా ఇస్తూ ఉంటారు. అయితే ప్రేమికుల రోజు పెట్స్‌ను గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం సరైన పని కాదంటోంది జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మి. పెట్స్‌ను గిఫ్ట్ గా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదని, పెట్స్ ను చాలా ఏళ్ల పాటు కాపాడుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

మద్యలో బ్రేకప్‌ అయితే వాటి బాధ్యత భారంగా మారే అవకాశం ఉంటుందని రష్మి తెలిపింది. అందుకే పెట్స్‌ ను గిప్ట్‌ గా ఇచ్చే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటూ సూచించింది. గిఫ్ట్‌లుగా ఇచ్చే సమయంలో మంచి బ్రీడ్‌ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతోంది.