సోనూసూద్ తల్లికి అరుదైన గుర్తింపు

సోనూసూద్ అనే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. వార్తల్లో ఎక్కడ పట్టినా ఆయనే పేరే కనిపిస్తోంది. తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్‌కు ఎన్నో అవార్డులు వస్తున్నాయి. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ సంస్థలు సైతం ఆయన సేవలను ప్రశంసిస్తున్నాయి. సినిమాల కంటే సేవా కార్యక్రమాలతోనే సోనూసూద్ ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు సోనూసూద్‌కు కోట్లామంది అభిమానులుగా మారారు.

SONUSOOD MOTHER ROAD
SONUSOOD-MOTHER-ROAD

తాజాగా సోనూసూద్ తల్లి అరుదైన గుర్తింపు దక్కించుకుంది. సోనూసూద్ సొంతూరు పంజాబ్‌లోని మోగా అనే విలేజ్. అక్కడే సోనూసూద్ కుటుంబం జీవిస్తోంది. ఆ విలేజ్‌లోని ఒక కాలేజీలో సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా గ్రామ ప్రజలు కీలక నిర్ణయం నిర్ణయించారు. ఆమె కాలేజీకి రోజూ నడిచివెళ్లే రోడ్డుకు ఆమె పేరు పెట్టారు. ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్ అంటూ పేరు పెట్టి ఒక శిలా ఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ రోడ్డును ప్రారంభించారు. తన తల్లికి దక్కిన అరుదైన గౌరవంపై సోనూసూద్ స్పందిస్తూ.. అదే రోడ్డులో మా అమ్మ ప్రతి రోజూ కాలేజీకి వెళ్లి వచ్చేదని, స్వర్గంలో ఉన్న తన తల్లిదండ్రులు ఇది చూసి ఎంతో సంతోషిస్తారని ఎమోషనల్ ట్వీట్ చేశారు.