నటిపై రెండేళ్లుగా అత్యాచారం

మీటూ ఉద్యమం ద్వారా సినీ హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో పాటు నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. తాజాగా డైరెక్టర్ ఆయుష్ తివారీపై ఒక టివీ నటి సంచనల ఆరోపణలు చేసింది. తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడంటూ అతడిపై ఒక నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది..

rape

దీంతో ఈ విషయం బయటపడింది. ఆయుష్ తివారి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మీటూ ఉద్యమంలో భాగంగా.. ఒక సినిమా చిత్రీకరణలో నానా పటేకర్ లైగింకంగా వేధించాడని తనుశ్రీ దత్త ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చాలా మంది నటీమణులు తమకు వివిధ సందర్భాల్లో జరిగిన వేధింపుల్ని బయటకు చెప్పారు. ఇటీవల మరో నటి పాయల్ ఘోష్ కూడా పాపులర్ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌‌ పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.