మేకింగ్ వీడియో కోసం అతన్ని రంగంలోకి దించిన రాజమౌళి

రాజమౌళి.. బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభమై రెండేళ్లైనా కరోనా కారణంతో షూటింగ్, సినిమా విడుదల ఆలస్యమయ్యాయి. సెకండ్ వేవ్ తగ్గడంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. షూటింగ్ ఫైనల్ లెగ్ కి రావడంతో రాజమౌళి ప్రమోషన్స్ మొదలుపెడుతూ ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోని జూలై 15న రిలీజ్ చేయనున్నాడు.

‘ROAR OF RRR’ అంటూ బయటకి రానున్న ఈ మేకింగ్ వీడియో జూలై 15వ తేదీన ఉదయం 11 గంటలకు రీలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించింది. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఈ మేకింగ్ వీడియోని చాలా స్పెషల్ గా ప్లాన్ చేసిన జక్కన్న ఇందుకోసం అన్న కీరవాణితో పాటు ర్యాప్ సింగర్ బ్లేజ్ ని రంగంలోకి దించాడు. రెహమన్ స్లమ్ డాగ్ లో బ్లూస్ రాప్ చేసిన బ్లేజ్, శివాజీ, బాబా, ఏం మాయ చేశావే, రోబో 2.0 లాంటి సినిమాల్లోని రాప్ పాడి మెప్పించాడు. ముఖ్యంగా శివాజీ సినిమాలోని ది బాస్ సాంగ్ కి హ్యుజ్ అప్లాజ్ వచ్చింది. కోలీవుడ్ లో ర్యాప్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన బ్లేజ్, రీసెంట్ గా తెలుగులో ఓహ్ మై గాడ్ డాడీ సాంగ్ పాడాడు. ఎలాంటి సిట్యుయేషన్ లో అయిన తన సాంగ్ తో జోష్ తెచ్చే బ్లేజ్, ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో ని మరింత స్పెషల్ చేయనున్నాడు. ఇంతకీ అసలు మేకింగ్ వీడియోలో రాజమౌళి ఏం చుపించాబోతున్నాడు? ఇప్పటివరకూ వేరు వేరుగా చూపించిన హీరోలని ఒకే చోట ఉండే చిన్న క్లిప్ అయినా మాకింగ్ వీడియోలో చూపిస్తాడా అనేది తెలియాలి అంటే ఇంకో 72 గంటలు ఎదురు చూడాల్సిందే.