సినీ నటుడు రావు రమేష్ అంత డబ్బు విరాళం ఇచ్చారా?

సినీ నటుడు రావు రమేష్ అటు రావు గోపాల రావు గారి కొడుకుగానే కాకుండా ఆయనకంటూ ప్రతీక స్థానం సంపాదించుకున్నారు. గతంలో ఆయన తండ్రి ఎలా అయితే ఎటువంటి పాత్రను అయినా పండించేవారో, అదే విధంగా ఇప్పుడు రావు గోపాలరావు కూడా పాత్ర ఎటువంటిది అయిన కూడా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసి మరి పండిస్తున్నారు. ఇప్పటికే ఆయన తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో సుమారు 170 సినిమాలలో నటించారు.

రావు రమేష్ గారు ఇటీవలే రఘురామరాజు గారిని కలవడం జరిగింది. ఆయన ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ తరపున ఉండి నియోజక శాసన సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. అయితే రావు రమేష్ గారు ఉండి నియోజక అభివృద్ది, అలాగే డ్రైనేజీలా బాగుకోసం రఘురమరాజు గారికి 3 లక్షల రూపాయల చెక్కు అందచేయడం జరిగింది.