గుజరాతీ అబ్బాయిగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్

ఈ జనరేషన్ బాలీవుడ్ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి రణ్వీర్ సింగ్. క్యారెక్టర్ ఏదైనా అద్భుతంగా నటించి మెప్పించగల రణ్వీర్ రీసెంట్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ ఆఫీసులో కనిపించాడు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఎందుకు వెళ్లాడు అనే కదా మీ డౌట్, ఆ బ్యానర్ లో రణ్వీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా బయటకి వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇందులో రణ్వీర్ లుక్ చూసిన వాళ్లందరూ క్యారెక్టర్ కోసం అతను బాగా తగ్గి కొత్త మేకోవర్ లో కనిపించాడు.

జయేష్ భాయ్ జోర్దార్ లో రణ్వీర్ గుజరాతీ అబ్బాయిగా నటిస్తున్నాడు, విమెన్ ఎంపవర్మెంట్ చుట్టూ తిరిగే ఈ కథని రణ్వీర్ సింగ్ రాయడం విశేషం. నిజానికి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఎంత డిలే అయినా జయేష్ భాయ్ జోర్దార్ సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.