Bollywood: ర‌ణ్‌వీర్ 83 రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టిస్తున్న తాజా చిత్రం 83. ప్ర‌ముఖ భార‌త సీనియ‌ర్ క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్ బ‌యోపిక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో ర‌ణ్‌వీర్ క‌పిల్‌దేవ్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి క‌బీర్‌ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. దీపికా ప‌దుకునే, క‌బీర్‌ఖాన్‌, సాజిద్ న‌డియాద్వాలా, విష్ణువ‌ర్ధ‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. Bollywoodఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. ఈ సినిమా జూన్‌4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్రబృందం పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇక Bollywoodఈ సినిమాలో క‌పిల్‌దేవ్ పాత్ర కోసం ర‌ణ్‌వీర్ క్రికెట్ శిక్ష‌ణ తీసుకున్నారు. క‌పిల్‌దేవ్ లాగా క‌నిపించాల‌ని ఎంతాగానో ప‌లు వ్యాయామాలు చేస్తూ.. ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు ర‌ణ్‌వీర్‌సింగ్‌.. మ‌రీ ర‌ణ్‌వీర్ న‌ట‌న‌, హావాభావాలు ఈ Bollywoodసినిమాలో ఎలా ఉంటాయ‌ని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.