
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాతణంలో వచ్చిన మర్దానీ ఫ్రాంచైజీ ఎంతగా విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ పదేళ్లలో వచ్చిన రెండు సీజన్లకు ఆడియెన్స్‌ను మంచి ఆదరణ లభించింది. భారతదేశంలో అతిపెద్ద, ఏకైక మహిళా కాప్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం మర్దానీ మూడో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
మర్దానీ 3లోనూ రాణి ముఖర్జీ న్యాయం కోసం నిస్వార్థంగా పోరాడే డేర్‌డెవిల్ కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రను తిరిగి పోషించనున్నారు. సోమవారం (ఏప్రిల్ 21) నాడు మర్దానీ 3 విడుదల తేదీని ప్రకటించారు. మర్దానీ 3 వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా మర్దానీ 3ని రిలీజ్ చేయబోతూన్నారు. మార్చి 4న వచ్చే హోలీ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మర్దానీ 3ని విడుదల చేయబోతూతోన్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.