ఆ హీరోతో పెళ్లి పీటలెక్కబోతున్న RRR బ్యూటీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలిభా భట్ తన ప్రియుడు బాలీవుడ్ టాప్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఈ లవ్ కఫుల్స్ నేడు నిశ్చితార్థం చేసుకోనున్నారని సమాచారం. మంగళవారం ఉదయం రణ్‌బీర్, అలియా భట్ జంట రణ్‌బీర్ తల్లి నీతుసింగ్‌తో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. జైపూర్‌లోని రణతంబోర్‌లో రణ్‌బీర్-అలియాభట్ నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. అక్కడికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారని సమాచారం.

ranabir kapoor and alia butt

అలాగే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు జైపూర్ చేరుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ భట్, రిద్దిమా కపూర్, ఆదర్ జైన్ ,కరణ్ జోహార్ వంటి ప్రముఖులు ఇక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది.
గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉండగా.. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో అనుకున్నారు. అంతలోపే లాక్‌డౌన్ రావడంతో పెళ్లిని వాయిదా చేసుకున్నారు. లాక్‌డౌన్ రాకపోతే తమ పెళ్లి పూర్తయ్యే ఉండేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రణ్ బీర్ పరోక్షంగా వెల్లడించాడు.

లాక్‌డౌన్‌లో అలియా తనకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకుందని, తాను మాత్రం ఆమెకు ఎలాంటి క్లాసులు తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ‘బ్రహ్మస్త’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో నాగార్జున ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నారు.