హాస్పిటల్‌లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన టీవీ నటుడు

ప్రముఖ టీవీ నటుడు కరణ్వీర్ బొహ్రా హాస్పిటల్‌లో డ్యాన్స్‌లతో రెచ్చిపోయాడు. రెండోసారి తండ్రి కాబోతున్నానని తెలిసి హాస్పిటల్‌లో డ్యాన్స్‌లు వేస్తూ హంగామా సృష్టించాడు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఆయన భార్య తేజే సిద్ధూ గతంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవల ఆమె రెండోసారి గర్భవతి కావడంతో.. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో కరణ్వీర్ ఆనందంలో మునిగితేలుతున్నాడు.

RANAVEER BEHRA

తన భార్యతో కలిసి తాజాగా హాస్పిటల్‌కి వచ్చాడు. ఈ సందర్భంగా కారు సీటును పట్టుకుని హాస్పిటల్‌లోకి డ్యాన్స్ వేసుకుంటూ వెళ్లాడు. దీంతో ఆయనను చూసిన వారు నవ్వుతూ ఈ వీడియోలో కనిపించారు. ఏ క్షణంలోనైనా శుభవార్త వినే అవకాశముందని, తాను చాలా లక్కీ అని కరణ్వీర్ సోషల్ మీడియాలో తెలిపాడు. ప్రస్తుతం ఈ దంపతులు కెనడాలో ఉన్నారు.

‘అమ్మాయి లేదా అబ్బాయి అనేది నాకు తెలియదు. నాకు కొంచెం భయంగా ఉంది. అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు. కానీ అమ్మాయిలను ఎలా పెంచుకోవాలో నాకు మాత్రమే తెలుసు. ముగ్గురు చిన్నారులు చాలా మధురంగా ఉంటారు’ అని తేజస్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.